కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మరసపెంట గ్రామానికి చెందిన రామవత్ హనుమా నాయక్. అతనికి ఆర్థిక ఇబ్బందులకు తోడు ఇటీవల కుటుంబ సమస్యలు అధికమయ్యాయి. ఫలితంగా మానసిక ఒత్తిడికి గురైన హనుమా నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - ఆర్థిక ఇబ్బందులు భరించలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా మరసపెంట గ్రామంలో జరిగింది.
ఆర్థిక ఇబ్బందులు భరించలేక పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య