వినుకొండలోని ఆలయం ముందు ఉన్న పోతురాజు విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ విషయంపై దేవస్థానం అధికారులు వినుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో లభ్యమయ్యాయి. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. హరిబాబు అనే వ్యక్తిని నిందితుడుగా గుర్తించారు. గతంలో ఒక కేసులో అరెస్ట్ అయిన హరిబాబు కొంతకాలంగా మతి భ్రమించి తిరుగుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వినుకొండలో పోతురాజు విగ్రహాం ధ్వంసం.. నిందితుడు అరెస్ట్ - వినుకొండ తాజా వార్తలు
గుంటూరు జిల్లా వినుకొండలో అంకాలమ్మ ఆలయం వద్ద ఉన్న పోతురాజు విగ్రహాన్ని ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
వినుకొండలో పోతురాజు విగ్రహాం ధ్వంసం.. నిందితుడు అరెస్ట్