సంక్రాంతికి కోడి పందాలు నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నా... వాటికి అవసరమైన బరుల ఏర్పాట్లు, కత్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కోడి కత్తులు విక్రయిస్తున్న ఓ వ్యాపారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నకరికల్లుకు చెందిన హనుమంతాచారి అనే వ్యక్తి.. కత్తులు తయారు చేసి అమ్ముతున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. . అతని వద్ద నుంచి 350 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.
కోడి కత్తులు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ - నకరికల్లు తాజా వార్తలు
గుంటూరు జిల్లా నకిరికల్లులో కోడి కత్తులు తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఉదయ బాబు హెచ్చరించారు.
కోడి కత్తులు
పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని నకరికల్లు ఎస్సై ఉదయ బాబు తెలిపారు. కోడి పందాలు, జూదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్ నియామకం