మంగళగిరిలో తమిళనాడు యువకుడి దారుణహత్య - manhgalagiri death news
గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని నవులూరులో ఓ వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతి చెందిన వ్యక్తి తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మురుగేష్‌గా గుర్తించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మురుగేష్... మంగళగిరిలోని ఓ ట్రాన్స్ పోర్టు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా నవులూరులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం ఉదయం ఓ వ్యక్తి హడావుడిగా బయటకు వెళ్లాడు. ఈ విషయం గమనించిన ఇంటి యజమాని కుమారుడు.... మురుగేష్ గదికి వెళ్లి చూశాడు. మురుగేష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి... వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మురుగేష్ శరీరంపై 15 కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.