ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగర్ కాలువలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య! - గుంటూరు క్రైం న్యూస్​

నాగార్జున సాగర్ కుడి కాలువలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు మాచర్లకు చెందిన షేక్ సుభానిగా గుర్తించిన పోలీసులు... అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.

a man committed suicide jump into nagarjuna Sagar right canal at tallapalli guntur
సాగర్ కుడి కాలువలో దూకి వ్యక్తి ఆత్మహత్య !

By

Published : Oct 10, 2020, 6:51 AM IST

గుంటూరు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన షేక్ సుభాని.. బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతని కోసం గాలించారు. ఆచూకీ దొరక్కపోవడం వల్ల పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

శుక్రవారం తాళ్లపల్లి గ్రామ సమీపంలోని సాగర్ కుడి కాలువలో ముళ్ల పొదల మధ్య ఉన్న మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కుటుంబీకుల ద్వారా ఆ మృతదేహం సుభానిదిగా గుర్తించారు. అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details