గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం జాలాది గ్రామానికి చెందిన గోపతోటి సురేష్ అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారుచోల-జగ్గాపురం మార్గంలో ఉన్న డంపింగ్ యార్డుకు సమీపంలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాంబాబు మృతదేహాన్ని పరిశీలించి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కుటుంబ గొడవలుగా అనుమానం..