ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారు..' - chebrou police issue

గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు తన సోదరుడిని కొట్టారంటూ నరసింహారావు అనే వ్యక్తి ఆరోపించాడు. భార్య తరఫు బంధువుల మాటలు విని.. తన సోదరుడిని కొట్టారని ఆరోపించాడు.

police
police

By

Published : Nov 8, 2021, 12:11 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు ఎస్సై తన తమ్ముడిని విచక్షణారహితంగా కొట్టారంటూ.. బాధితుడి సోదరుడు నరసింహారావు ఆరోపించాడు. శేకూరు గ్రామానికి చెందిన దిలీప్ చక్రవర్తి, అతని భార్య మనస్పర్థల వల్ల పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. కౌన్సెలింగ్ జరుగుతున్నందువల్ల.. భార్యాభర్తలు ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు.

అయితే.. భార్య తరఫు బంధువుల మాటలు విని.. దిలీప్​ను ఎస్సై రాజ్ కుమార్ చితకబాదారంటూ.. ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించాడు. తనను.. కేసుల పేరుతో బెదిరిస్తున్నారని నరసింహారావు వాపోయాడు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరాడు.

ఇదీ చదవండి:

చిక్కిపోతున్న సున్నా వడ్డీ పంట రుణాల పథకం

ABOUT THE AUTHOR

...view details