అక్రమంగా తెలంగాణ మద్యం విక్రయం...వ్యక్తి అరెస్టు - చిలకలూరిపేట నేర వార్తలు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం గోవిందపురం- కమ్మవారిపాలెం గ్రామాల మధ్య అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఆదివారం సాయంత్రం చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 135 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
a man arrested for selling liquor illegally in chilakaluripet rural
గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని గోవిందపురం- కమ్మవారిపాలెం గ్రామాల మధ్య స్థావరం ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయిస్తున్న కట్టా సురేశ్ అనే వ్యక్తిని చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 135 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు చిలకలూరిపేట గ్రామీణ ఎస్సై తెలిపారు.