ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేయసితో పెళ్లి జరిపించాలని యువకుడు హల్​చల్ - ప్రేయసి కోసం ప్రేమికుడి ఆత్మహత్యాయత్నం

తన ప్రేయసితో పెళ్లి జరిపించాలంటూ ఓ యువకుడు పెట్రోల్ బాటిల్​తో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో హల్​చల్ చేశాడు. ఇద్దరం మేజర్లమైన కూడా పోలీసులు మాకు సహకరించడంలేదని..ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయాలని..లేకపోతే పెట్రోల్ మీద పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని తెలిపాడు.

a lover   suicide attempt with petrol for his girlfriend at sattenapalli in guntur
ప్రేమికుడు వినోద్

By

Published : May 15, 2020, 1:35 PM IST

ప్రేయసితో పెళ్లి జరిపించాలంటూ పెట్రోల్ బాటిల్​తో యువకుడి హల్​చల్

ప్రేమ కోసం... ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు పెట్రోల్ బాటిల్​తో హల్​చల్​ చేశాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వినోద్ అదే పట్టణానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులకు వారిద్దరూ చిక్కటంతో... యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.

తామిద్దరమూ మేజర్లమని.. మా ఇద్దరిని వేరు చేయాలని యువతి తల్లిదండ్రులు చూస్తున్నారని వినోద్​ సత్తెనపల్లి సెంటర్​లో పెట్రోల్ బాటిల్​తో ఆందోళనకు దిగాడు. యువతితో వివాహం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు కూడా అమ్మాయి తల్లిదండ్రులకే మద్దతిస్తున్నారని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ యువకుడిని స్టేషన్​కు తరలించారు.

ఇదీచూడండి.పూరి గుడిసెకు రూ.3 వేలకు పైగా కరెంట్ బిల్లు !

ABOUT THE AUTHOR

...view details