అగ్ని ప్రమాదంలో ఒక పూరిల్లు దగ్ధం అయ్యింది. ఈ ఘటన గుంటూరులోని నగరం మండలం ధూళిపూడి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని...ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు అదుపు కాకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం... రూ.4 లక్షల ఆస్తి నష్టం - గుంటూరు తాజా సమాచారం
ప్రమాదవశాత్తు పూరిల్లుకు నిప్పు అంటుకుని దగ్ధమైంది. ఈ ఘటన గుంటూరులోని నగరం మండలంలో జరిగింది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
A Hut Was burnt
ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ పొలం పనులకు వెళ్ళడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే కొన్ని బంగారు ఆభరణాలు, రూ. రెండు లక్షల నగదు పాక్షికంగా కాలిపోయాయి. ఇంట్లో సామాన్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ. 4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే ప్రారంభం