నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో రహదారి పక్కన నడిచి వెళ్తున్న బాలికను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ బాలిక అక్కడికక్కడే చనిపోయింది. ఆమెను స్థానిక బీసీ కాలనీకి చెందిన సయ్యద్ రసూల్ బీ గా గుర్తించారు. సంఘటనా స్థలంలోనే లారీని విడిచి.. డ్రైవర్ పరారయ్యాడు. రెండో పట్టణ ఎస్సై రబ్బానీ.. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
లారీ ఢీ, బాలిక మృతి.. డ్రైవర్ పరార్ - నరసరావుపేటలో లారీ ఢీకొని బాలిక మృతి
నరసరావుపేటలో లారీ ఢీ కొట్టి ఓ బాలిక మృతి చెందింది. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

లారీ ఢీకొని బాలిక మృతి