ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాత్రి వేళల్లో ఇంటి ముందు వాహనం కనబడితే అంతే!

ఇంటి ముందు నిలిపిన బైకులు, ఆటోలు కనిపిస్తే చాలు.. ఆ నలుగురు యువకులు పక్కా ప్రణాళికతో రెక్కి వేసి రాత్రికి రాత్రే ఎత్తుకెళ్తారు. అనంతరం వాటి నెంబర్లు మార్చేసి.. మారు బేరానికి పెడతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను ఎత్తుకెళ్లారు. తెనాలి చుట్టుపక్కల దొంగతనాలు చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు.

theft Vehicles parked in front of houses
వాహనాల దొంగలు

By

Published : Jun 24, 2021, 1:57 PM IST

పట్టుబడిన వాహనాలు.. వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యువకులు ఇళ్ల ముందు నిలిపిన వాహనాలనే టార్గెట్​గా పెట్టుకుంటారు. రాత్రికి రాత్రే వాటిని ఎత్తుకెళ్లి అమ్మేస్తారు. అనంతరం వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తారు. లాక్​డౌన్​తో ఉపాధిలేక బైక్​లు, ఆటోలు చోరీ చేయడం ప్రారంభించారు. చివరకు చేబ్రోలు పోలీసులకు చిక్కిపోయారు. వారి నుంచి తొమ్మిది ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

ఎలా చిక్కారంటే..

ఈనెల 17వ తేదీన చేబ్రోలులో ఓ ఇంటి ముందు ఉంచిన టీవీఎస్ వాహనం దొంగతనానికి గురైంది. సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వాహనం కోసం పట్టణంలో పోలీసులు గాలిస్తుండగా.. గుంటూరు జిల్లా మంగళ దాస్ నగర్​కు చెందిన నాగేంద్రబాబు అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో తారసపడ్డాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఇంటి ముందు ఉంచిన వాహనాలను ఆటోలను చోరీ చేసి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మిగతా ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగలించిన వాహనాల వివరాల ఆధారంగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని తెనాలి డీఎస్పీ ప్రశాంతి తెలిపారు. దొంగతనాలు చేసిన బైక్​లను, ఆటోలను యజమానులకు అందజేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details