Father killed his daughter: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో మానవత్వం మంట కలిపిన ఘటన జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే భార్యకు అబార్షన్ మందులు బలవంతంగా ఇచ్చి.. గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతికి కారణమయ్యాడు. ఇప్పటికే కూతురు ఉండగా మళ్లీ ఆడపిల్లే పుడుతుందని భావించిన ఆ కర్కశకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానిక హఫీజ్‌బాబా నగర్‌లో చెందిన మహమూద్ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ భార్యతో కలిసి నివాసముంటున్నారు. ఈ దంపతులకు 18నెలల కూతురు ఉండగా.. మళ్లీ అతని భార్య గర్భం దాల్చింది. మళ్లీ ఆడపిల్ల జన్మిస్తుందనే భయంతో కుటుంబ సభ్యులతో కలిసి భార్యకు బలవంతంగా అబార్షన్ మందులు వేయించాడు. మందుల ప్రభావంతో గర్భిణికి ఈ నెల 15న తీవ్ర రక్తస్రావం జరిగి మృత ఆడ శిశువు తల్లి కడుపు నుంచి బయటకు రాగా ఖననం చేశారు.
మళ్లీ ఆడపిల్ల పుడుతుందని.. కడుపులోనే చంపేశాడు
father killed his daughter: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లో మానవత్వం మంట కలిపిన ఘటన చోటు చేసుకుంది. గర్భంలో ఆడ శిశువు ఉందని తెలుసుకున్న కన్నతండ్రే, భార్యకు అబార్షన్ మందులు బలవంతంగా ఇచ్చి గర్భంలో ఉన్న ఆడశిశువు మృతికి కారణమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మళ్లీ ఆడపిల్ల పుడుతుందని కడుపులో ఉండగానే చంపేశాడు
అనారోగ్యానికి గురైన తల్లి మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకుని విచారించారు. సంతోష్‌నగర్‌లోని శ్మశానవాటికలో ఖననం చేసిన మృత శిశువు దేహాన్ని బయటకు తీసి.. అక్కడే వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఇవీ చదవండి: