ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం - తాడేపల్లిలో సీఎం జగన్​ నివాసం దగ్గరలో మహిళ ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లాలో చంద్రశేఖర్ అనే తహసీల్దార్​ డబ్బు తీసుకుని మోసం చేశాడంటూ.. ఓ మహిళ ప్రాణాలు తీసుకోవాలని చూసింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలోనూ సచివాలయం దగ్గర ఆమె ఇదే తరహాలో ఆత్మహత్యాయత్నం చేసింది.

woman suicide attempt
సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 19, 2021, 8:56 AM IST

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

సచివాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు మళ్లీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. తమకు న్యాయం చేయలంటూ చిట్టమూరు మండలం చిలమూరుకు చెందిన అరిగెల నాగార్జున దంపతులు సీఎంను కలవాలని కోరుతూనే.. అతని భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

భూములను ఆన్‌లైన్‌లో నమోదు చేసి.. పాస్‌ పుస్తకం ఇవ్వడానికి దుత్తలూరు తహసీల్దార్ చంద్రశేఖర్ రూ.కోటిన్నర తీసుకుని పని చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తమ భూమితో పాటు బంధువుల పొలాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రూ.కోటిన్నర వసూలు చేసి ఇచ్చామని బాధితులు చెబుతున్నారు. ఏడాది అవుతున్నా.. పని చేయకపోవడంతో తిరిగి డబ్బులు అడిగితే తనను హత్య చేయించేందుకు కుట్రపన్నారని వాపోయారు. గతంలో ఒకసారి న్యాయం చేయాలని నెల్లూరు కలెక్టరేట్‌ వద్ద ఆత్మహత్యాయత్నం చేయగా.. అధికారులు విచారణ చేసి తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేశారన్నారు. మళ్లీ తహసీల్దార్‌ వేధింపులు భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితులు కన్నీరుమున్నీరయ్యారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details