ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరులో మత్స్యకార గ్రామాల మధ్య వివాదం - కృష్ణా నదిలో మత్స్యకారుల వివాదం

గుంటూరు జిల్లాలో రెండు మత్స్యకార గ్రామాల మధ్య వివాదం తలెత్తింది. కృష్ణా నదిలో ఐలా వలలతో చేపలు పడుతున్న గాజుల్లంక మత్స్యకారులను, పోతర్లంక వారు అడ్డుకున్నారు. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

two fishing villages
మత్స్యకార గ్రామాల మధ్య వివాదం

By

Published : Dec 20, 2020, 3:44 PM IST

ప్రకాశం జిల్లాలో మత్స్యకార గ్రామాల మధ్య వివాదం మరువక ముందే గుంటూరు జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. కొల్లూరు మండలంలోని గాజుల్లంక మత్స్యకారులను పోతర్లంక వారు అడ్డుకున్నారు. నిషేధిత ఐలా వలలతో గాజుల్లంక మత్స్యకారులు చేపల వేట సాగిస్తున్నారని పోతర్లంక గ్రామస్థులు ఆరోపించారు. ఈ విషయం పై కృష్ణా నదిలో బోట్లు అడ్డుగా పెట్టి చేపల వేట అడ్డగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details