గుంటూరు జిల్లా తెనాలిలో పాతనేరస్థుడు భరత్ హల్‌చల్ చేశాడు. పోలీసులు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ చెరువులో దూకాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దొంగతనం కేసులో భరత్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ఐతానగర్‌లోని ఇంటికి వెళ్లారు.
'నాపై కేసు పెడతారా.. ఆత్మహత్య చేసుకుంటా..' - గుంటూరు జిల్లా నేర వార్తలు
తనపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి చెరువులో దూకాడు. ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ సృష్టించాడు. అసలేం జరిగిందంటే..?
భరత్
పోలీసులను చూసిన భరత్ ఇంట్లో నుంచి పరారై.. చేపల చెరువులో దూకాడు. పోలీసులు తనను అరెస్టు చేస్తే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు చెరువు దగ్గర నుంచి వెళ్లిపోయాక నీళ్లలో నుంచి బయటికి వచ్చాడు. గతంలోనూ భరత్ ఓ సారి కాల్వలో దూకి హల్‌చల్ చేశాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:
కొత్తగా 4 వేల ఉద్యోగాలు.. ఆన్లైన్లో సినిమా టికెట్లు.. అమ్మఒడికి అది తప్పనిసరి