గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లిలో ఓ ఆవు ఒకేసారి మూడు దూడలకు జన్మనిచ్చింది. వాటిలో రెండు పెయ్యలు, ఒక కోడెదూడ ఉన్నాయి. గ్రామానికి చెందిన రాజనాల కొండలుకు మూడేళ్ల క్రితం ఆవుదూడను కొన్నారు. అది ఇటీవలే మూడు దూడలను ఈనటం విశేషం. దూడలను పశువైద్యాధికారి శ్రీనివాసరావు పరీక్షించారు. అన్నీ ఆరోగ్యంగానే ఉన్నాయని తెలిపారు. పిండం విడిపోవటం వల్లే ఇలా ఒకటి కంటే ఎక్కువ జన్మిస్తాయని వివరించారు.
ఒకే ఈతలో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు - inuparajupalli latest news
ఓ ఆవు ఒకే ఈతలో మూడు దూడలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటన గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఇనుపరాజుపల్లిలో చోటు చేసుకుంది.
![ఒకే ఈతలో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు A cow gave birth to three calves](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10518721-235-10518721-1612584811540.jpg)
మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు