అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రవేశ ద్వారం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమంలో తెదేపా నేతలు నసీర్ అహ్మద్, మన్నన సుబ్బారావు, సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్‌కు వచ్చిపోయే ప్రయాణికులు అమరావతికి మద్దతుగా సంతకాలు చేశారు. చంద్రబాబుపై కక్షతో రాజధాని తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. ఇది మంచి నిర్ణయం కాదని నసీర్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకూ తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని సీపీఐ నేత అజయ్ కుమార్ వెల్లడించారు.
'రాజధాని కొనసాగించాలని కోరుతూ... సంతకాల సేకరణ' - A collection of signatures
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రవేశ ద్వారం వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది.
గుంటూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
TAGGED:
A collection of signatures