ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లాలో దారుణం.. ఏడు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి.. - ఏడు నెలల పాపపై అత్యాచారం

గుంటూరు జిల్లా బోదనంపాడు వద్ద దారుణం చేటుచేసుకుంది. తల్లి పక్కన పడుకున్న ఏడు నెలల పాపను ఎత్తుకెళ్లిన దుండగులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాచర్ల గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

girl child raped at Guntur
చిన్నారిపై అత్యాచారం

By

Published : Jul 20, 2021, 10:21 PM IST

ముక్కుపచ్చలారని చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం బోదనంపాడులో చోటుచేసుకుంది. ఏడు నెలల చిన్నారిని కన్నతల్లి రాత్రి ఊయలలో వేసి నిద్రపుచ్చింది. ఉదయాన్నే చూస్తే పాప కనిపించలేదు. ఆందోళన చెందిన తల్లి పాప కోసం చుట్టుపక్కల అంతా వెతికింది. ఇంటికి కొద్దీ దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిఉన్న పాపను స్థానికులు చూశారు. విషయం తెలుసుకున్న ఆ తల్లి బోరున విలపిస్తూ వెళ్లింది. చిన్నారి పెదాలు, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పాపను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసిన పలు కోణాల్లో విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details