గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో.. నలుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... కృష్ణాయపాలెం నుంచి నలుగురు వ్యక్తులు కారులో వస్తుండగా.. ఎర్రబాలెం చెరువు మలుపు వద్దకు రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి, చెరువులోకి దూసుకెళ్లింది.
చెరువులో పడిన కారు.. నలుగురు మృతి! - గుంటూరు జిల్లాలో కారు బోల్తా
20:56 January 17
గుంటూరు జిల్లాలో ఘటన
ఈ ప్రమాదంలో.. కారులో ఉన్న సాయి, శ్రీనివాస్, నరేంద్ర కుమార్, తేజ రాంజీ కారులోనే మృతిచెందారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించి.. కారు అద్దాలు పగులగొట్టి నలుగురిని బయటకు తీశారు. కానీ.. అప్పటికే వారంతా ప్రాణాలు కోల్పోయారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ నలుగురిలో సాయి, శ్రీనివాస్, నరేంద్ర మంగళగిరి వాసులు కాగా.. తేజ రాంజీ ఎర్రబాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. వీరి మృతితో వారి గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి :రోకలిబండతో కొట్టి.. పెట్రోల్ పోసి తగలబెట్టి