ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్నిమాపక అధికారి ఇంట్లో దొంగతనం - chilakaluripet latest news

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా అగ్నిమాపక అధికారి ఇంటికే కన్నం వేశారు. మూడు సవర్ల బంగారం, వెండి వస్తువులు, రూ.25 వేల విలువ చేసే కెమెరాను ఎత్తుకెళ్లారు.

robbery in chilakaluripet news
robbery in chilakaluripet news

By

Published : Nov 29, 2020, 3:29 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంకు కాలనీలోని అగ్నిమాపక శాఖ అధికారి సునీల్ ఇంట్లో దొంగలు పడ్డారు. శిక్షణ నిమిత్తం ఆయన సత్తెనపల్లిలో ఉంటున్నారు. కుటుంబ సభ్యులు 15 రోజుల క్రితం నెల్లూరు వెళ్లారు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన అగ్నిమాపక అధికారి... దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు సవర్ల బంగారం, రూ.10 వేలు విలువ చేసే వెండి వస్తువులు, మరో రూ.25 వేల విలువచేసే కెమెరా ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పట్టణ ఎస్ఐ రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details