మహాశివరాత్రి పర్వదినం రోజున విషాదం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామానికి చెందిన రైతులు ప్రభ నిర్మించుకుని నాలుగు ఎడ్లబండ్లపై కోటప్పకొండకు బయల్దేరారు. యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి మీద ప్రభ బండికి కందెన వేసే క్రమంలో కొద్దిసేపు నిలిపారు. ఇదే సమయంలో వెనక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఎడ్లబండ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెద్ద గొట్టిపాడు గ్రామానికి చెందిన నిమ్మగడ్డ కోటేశ్వరరావు(65) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన కోడూరు శివాజీ(61) ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయాడు. వీరితోపాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాద సంఘటన జరిగిన తరువాత పోలీసులు రాకపోవడంతో బాధితులు జాతీయ రహదారిపై ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
ఎడ్లబండిని ఢీకొన్న లారీ...ఇద్దరు మృతి - A bullock cart collided with lorry two died
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు గ్రామానికి చెందిన రైతులు ప్రభను నిర్మించుకొని ఎడ్లబండిలో కోటప్పకొండకు వెళ్తుండగా దుర్ఘటన జరిగింది.
ఎడ్లబండిని లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి