గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగంజాగర్లమూడిలో ఓ తాపీ మేస్త్రీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక నాగబ్రహ్మాజీ అనే భవన నిర్మాణ కార్మికుడు ఉరేసుకుని చనిపోయాడు. అయితే రాష్ట్రంలో ఇసుక కొరత వల్ల నాలుగు నెలలుగా పనులు లేకే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య లక్ష్మీ తిరుపతమ్మ విలపించింది. కుటుంబాన్ని నడపడం కోసం తాను స్పిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నట్లు తెలిపింది. నాగ బ్రహ్మాజీ గత కొద్ది కాలంగా సరైన ఉపాధి లేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడని అతని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాపీ మేస్త్రీ బలవన్మరణం... ఇసుక కొరతే కారణం...!
రాష్ట్రంలో ఇసుక కొరత ఓ భవన నిర్మాణ కార్మికుణ్ని బలి తీసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగంజాగర్లమూడిలో నాగబ్రహ్మాజీ అనే తాపీ మేస్త్రీ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇసుక కొరత వల్ల గత కొంతకాలంగా సరైన ఉపాధి లేక మనోవేదనకు గురై ఉరేసుకున్నాడని అతని భార్య, బంధువులు విలపించారు.
తాపీ మేస్త్రీ బలవన్మరణం
Last Updated : Oct 26, 2019, 10:29 AM IST