గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో మత్స్యకారుల వలకు భారీ సొర చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన జాలర్ల వలలో సుమారు 12వందల కేజీల సొర చేప పడింది. అరుదుగా ఇలాంటి సొర చేపలు చిక్కుతుంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. తినడానికి పనికిరాని..ఈ సొర చేపను ఔషధాల తయారీలో వినియోగిస్తారని జాలర్లు తెలిపారు.
చిక్కిన భారీ సొర చేప.. ఔషధాల తయారీలో ఉపయోగం
మత్స్యకారుల వలకు ఓ భారీ సొర జాతి చేప చిక్కింది. ఈ మీనం సుమారు 1200 కేజీల బరువు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు.
భారీ సొర జాతి చేప