ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడేపల్లిలో రోడ్డుపై భారీ గుంత.. మరమ్మతులకు ఎమ్మెల్యే ఆదేశం - తాడేపల్లిలో 17వ వార్డులో రహదారిపై ఆరడుగుల గుంట

గుంటూరు జిల్లా తాడేపల్లిలో రహదారిపై ఒక్కసారిగా ఆరడుగుల భారీ గుంత ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదేశించారు.

a big hole formed on the road at Tadepalli guntur district
తాడేపల్లిలో రోడ్డుపై భారీ గుంత.. మరమ్మతులకు ఎమ్మెల్యే ఆదేశం

By

Published : Oct 23, 2020, 3:57 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు దారణంగా తయారయ్యాయి. గుంతలు, గతుకుల రోడ్డపై ప్రయాణం చేయాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే గుంటూరు జిల్లా తాడేపల్లిలో 17వ వార్డులో రహదారిపై ఉన్నట్టుండి ఒక్కసారిగా రోడ్డు కుంగీ ఆరడుగుల గుంత ఏర్పడింది. దీంతో వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాన్ని పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details