గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో యశ్వంత్(8) అనే బాలుడు ఈ నెల 17 రాత్రి నుంచి కనిపించడం లేదని అతని తల్లి లక్ష్మి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మి కొంతకాలంగా పల్లెపు వీరాస్వామితో సహజీవనం సాగిస్తోంది. వీరాస్వామి బైక్పై రెండు రోజుల క్రితం వెళ్లగా అప్పటినుంచే యశ్వంత్ కనిపించడం లేదని తెలుస్తోంది. అతడే చిన్నారిని కొట్టి… మూటకట్టి… ద్విచక్రవాహనంపై పెట్టుకొని పరారైనట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందం యశ్వంత్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
8ఏళ్ల బాలుడు అదృశ్యం..తల్లితో సహజీవనం చేస్తున్నవ్యక్తిపై అనుమానం - 8years old boy disappearing- villagers suspecting a man who cohabiting with his mother
ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల తన కుమారుడు రెండురోజుల నుంచి కనిపించడం లేదని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే బాలుడ్ని కొట్టి…మూటకట్టి…ద్విచక్రవాహనంపై పరారైనట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. ఎక్కడా గ్రామం…??ఎవరా వ్యక్తి..??
8ఏళ్ల బాలుడు అదృశ్యం-తల్లితో సహజీవనం చేస్తున్నవ్యక్తిపై గ్రామస్థుల అనుమానం