గుంటూరు జిల్లా మాచర్లలో శనివారం వర్చువల్ విధానంలో లోక్అదాలత్ నిర్వహించారు. దీని ద్వారా 82 కేసులు పరిష్కారమయ్యాయి. మాచర్ల కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి సి.మధుబాబు కక్షిదారులతో మాట్లాడారు. ఈ అదాలత్లో 41 క్రిమినల్, 4 సివిల్ కేసులతో పాటు 38 ప్లీ బార్గైన్ క్రిమినల్ కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులు వర్చువల్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జడ్జి కోరారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈసారి వర్చువల్ విధానంలో లోక్అదాలత్ను నిర్వహించారు.
వర్చువల్ లోక్ అదాలత్లో 82 కేసులు పరిష్కారం - guntur district news
గుంటూరు జిల్లా మాచర్లలో శనివారం వర్చువల్ విధానంలో జరిగిన లోక్అదాలత్లో 82 కేసులు పరిష్కారమయ్యాయి. మాచర్ల కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి సి.మధుబాబు కక్షిదారులతో మాట్లాడారు.
lok adalat