మద్యం దుకాణంలో మందుబాబులు చోరీ - 800 alcohol bottles theft in bar
లాక్‌డౌన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయగా... మందుబాబులు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. గుంటూరు రెడ్డిపాలెంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ తాళాలు పగులకొట్టి దుండగులు 800 మద్యం బాటిళ్లను అపహరించారు. ఈ మేరకు సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కరోనా వైరస్‌తో అందరూ కలవరం చెందుతుంటే... మందుబాబులు మాత్రం మద్యం దుకాణాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. గుంటూరు రెడ్డిపాలెంలో తాజాగా మద్యం దొంగలు ఓ బార్ అండ్ రెస్టారెంట్ తాళాలు పగులగొట్టి 800 మద్యం బాటిళ్లను అపహరించారు. మద్యం దుకాణాంలో ఆగంతుకులు చోరీకి పాల్పడుతున్న దృశ్యాలను సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల మద్యం దుకాణాల్లో చోరీ ఘటనలు వెలుగుచూశాయి. లాక్‌డౌన్ ముగిసేవరకు మందుబాబుల నుంచి సరకును ఎలా కాపాడుకోవాలో తెలియక అటు అధికారులు... ఇటు బార్ల యజమానులు సతమతమవుతున్నారు.