ఖరీఫ్ సీజన్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 94 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం 8 లక్షల క్వింటాళ్ల ఆయా రకాల విత్తనాలు వివిధ జిల్లాలకు చేరాయని వివరించారు.
AGRICULTURE COMMISIONER : 94 లక్షల ఎకరాలకు 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం అందుకోసం నాలుగు అంచెల వ్యవస్థ..
ఎరువుల కొరత లేకుండా నాలుగు అంచల వ్యవస్థను సైతం ఏర్పాటు చేశామన్నారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఉన్నందున అన్నదాతలకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కౌలు రైతులు సైతం రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందేలా చర్యలు చేపట్టామంటోన్న వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్తో 'ఈటీవీ భారత్' ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి.
AGRICULTURE COMMISIONER : 94 లక్షల ఎకరాలకు 8 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం ఇవీ చూడండి :CJI NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ చొరవ.. నెరవేరనున్న తెలంగాణ హైకోర్టు కల