ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరింత ఉద్ధృతంగా మారనున్న అమరావతి ఉద్యమం.. రైతులంతా కలిసి.. - amaravati protest update news

773th day amaravati protest: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు రైతు సంక్షేమ సంఘాలను రైతులు ఏర్పాటు చేస్తున్నారు. తుళ్లూరు మండలం మందడంలో ఏర్పాటు చేసిన మొదటి రైతుల సంక్షేమ సంఘాన్ని రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రారంభించారు. మరోవైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ 773వ రోజు రైతులు నిరసనలు చేపట్టారు.

amaravati protest
amaravati protest

By

Published : Jan 28, 2022, 4:45 PM IST

773th day amaravati protest: పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 773వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు రైతు సంక్షేమ సంఘాలను రైతులు ఏర్పాటుచేస్తున్నారు. తుళ్లూరు మండలం మందడంలో ఏర్పాటు చేసిన మొదటి రైతు సంక్షేమ సంఘాన్ని రాజధాని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రారంభించారు.

రాజధాని గ్రామాల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధిపై ఎప్పటికప్పుడు సీఆర్డీఏ దృష్టికి రైతు సంక్షేమ సంఘాలు తీసుకెళ్లాలని సుధాకర్ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పనిచేయడం.. గ్రామాల్లో సమస్యలను ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details