ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా సోకి 75 ఏళ్ల వృద్ధురాలు మృతి - కరోనాతో గుంటూరులో వృద్ధురాలు మృతి వార్తలు

కరోనా కారణంగా గుంటూరు జిల్లా కావూరు గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. ఇతర ప్రాంతం నుంచి వచ్చిన వారి కారణంగా వృద్ధురాలికి కరోనా సోకింది. ఆమెతో పాటుగా మరో ఏడుగురికి పాజిటివ్​గా తేలింది. వారంతా చికిత్స పొందుతున్నారు.

75years old women was expired due to corona in guntur district
కరోనా సోకి 75ఏళ్ల వృద్ధురాలు మృతి

By

Published : Jan 30, 2021, 10:25 AM IST

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కావూరు గ్రామానికి చెందిన ఓ 75 ఏళ్ల వృద్ధురాలు.. కరోనాతో మృతి చెందినట్లు పీహెచ్​సీ వైద్యులు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి కావూరు గ్రామానికి వచ్చిన వారి నుంచి.. వృద్ధురాలికి కరోనా సోకింది. ఆమెను జీజీహెచ్​కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. వృద్ధురాలు నివసించే పరిసర ప్రాంతాల వారికి కరోనా పరీక్షలు చేశారు. ఏడుగురికి పాజిటివ్ గా నిర్ధరణైంది.

వృద్ధురాలు నివసించే ఇంటి పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరికీ.. వైద్యులు, సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఏడుగురికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. ఒకరిని కేఎంసీ వైద్యశాలకు తరలించారు. మరో ఆరుగురిని హోమ్ క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details