గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న 73 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏసీ వాహనంలో బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు దాడులు చేసి.. స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఫిరంగిపురానికి చెందిన కుంభ మల్లమ్మ, వల్లెపు కోటేశ్వరరావును అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణా... 73 బస్తాలు పట్టివేత - బోయపాలెంలో రేషన్ బియ్యం పట్టివేత వార్తలు
గుంటూరు జిల్లా బోయపాలెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.

రేషన్ బియ్యం పట్టివేత