గుంటూరు జిల్లాలో కొత్తగా 719 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 31వేల 504 కి చేరుకుంది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని 22వేల 320మంది ఇళ్లకు చేరుకున్నారు. జిల్లాలో ఇవాళ కొత్తగా 6మరణాలు సంభవించాయి. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 328కు చేరింది.
రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు గుంటూరు జిల్లాలోనే నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరంలోనే 174 ఉన్నాయి. మిగతా మండలాల వారీగా చూస్తే... మాచర్ల -46, సత్తెనపల్లి -45, తాడేపల్లి -44, మంగళగిరి -33, నరసరావుపేట -31, రెంటచింతల-29, కారంపూడి -28, నూజెండ్ల -24 , దాచేపల్లి -21, దుగ్గిరాల -20, చిలకలూరిపేట-16, భట్టిప్రోలు-15, పిడుగురాళ్ల -14, పొన్నూరు-14. వెల్దుర్తి -11, అచ్చంపేట-10, క్రోసూరు-10 చొప్పున కేసులు వచ్చాయని బులిటెన్ విడుదల చేశారు.