ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వామ్మో... ఒక్క చెట్టుకు ఇన్ని కొబ్బరికాయలా....?! - గుంటూరు జిల్లా ముఖ్యాంశాలు

సాధారణంగా ఏ కొబ్బరిచెట్టుకైనా.... ఎన్నికాయలు కాస్తాయి? ఒక్కో గెలకు 10 నుంచి 20... లేదంటే..... సంకర జాతి రకాలైతే 40 వరకూ వస్తాయి. కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఓ కొబ్బరిచెట్టు గెలకు 70 కాయలు కాశాయి. చెట్టుకు వచ్చిన అన్నీ గెలలూ దాదాపు ఇలాగే ఉండటం విశేషంగా ఆకర్షిస్తోంది.

కొబ్బరి చెట్టుకు కొబ్బరి బోండాలు
కొబ్బరి చెట్టుకు కొబ్బరి బోండాలు

By

Published : Feb 3, 2021, 12:26 PM IST

Updated : Feb 3, 2021, 2:48 PM IST

వామ్మో... ఒక్క చెట్టుకు ఇన్ని కొబ్బరికాయలా....?!

గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతున్న ఈ కొబ్బరిచెట్టును చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి రైతు బెల్లంకొండ శేషగిరిరావు తనకున్న ఖాళీ స్థలంలో వివిధ రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. అక్కడే ఐదేళ్ల క్రితం కొబ్బరి మొక్కలు కూడా నాటారు. వాటిలో ఒక చెట్టు విరగకాసింది. ఒక్కో గెలకు 60 నుంచి 70 కొబ్బరి బోండాలు ఉన్నాయి. మామూలుగా అయితే గెలకు ఉండే కాడలకు ఒకటికి మించి పిందెలు వచ్చినా.... ఒక్కటి మాత్రమే కాయగా మారుతుంది. మిగతావి రాలిపోతాయి.

కానీ ఇక్కడ మాత్రం ఒక్కో కాడకు నాలుగైదు పిందెలు వచ్చాయి. అన్నీ కొబ్బరికాయలుగా ఎదుగుతున్నాయి. ఈ చెట్టుకు మొత్తం 9గెలలు ఉండగా... అందులో ఐదు పెద్దవయ్యాయి. అన్నింటికీ కూడా కాయలు భారీ సంఖ్యలో రావటంపై ఆ రైతు సంతోషం వెలిబుచ్చారు. చాలా అరుదుగా మాత్రమే ఇలా కాయలు కాస్తాయని.... జిల్లా ఉద్యానశాఖ అధికారి సుజాత తెలిపారు. కొన్ని హైబ్రిడ్‌ రకాల్లో 40 కాయల వరకూ వస్తాయని... కానీ ఈ చెట్టుకు చాలా రావడం విశేషమని అన్నారు.

Last Updated : Feb 3, 2021, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details