ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ..ఏడుగురు ఆత్మహత్యాయత్నం
ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ.. ఏడుగురు ఆత్మహత్యాయత్నం - పొత్తూరులో ఏడుగురు ఆత్మహత్యాయత్నం వార్తలు
గుంటూరు శివారు పొత్తూరు డంపింగ్ యార్డు వద్ద ఆక్రమణల తొలగింపును నిరసిస్తూ... ఏడుగురు ఆత్మహత్యకు యత్నించారు. గతంలో అపాచీకి కేటాయించిన ఈ స్థలంలో కొంత కాలంగా ఆక్రమణలు వెలిశాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు వీటి తొలగింపు చర్యలు చేపట్టడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఏడుగురు వ్యక్తులు పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించారు. వీరిని జీజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

7-members-suicide-attempt-in-pothuru-guntur-district