గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నరసరావుపేటలోనే 6 కేసులు నమోదు కావడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల కరోనానో మృతి చెందిన వ్యక్తి.. అంతకు ముందు నివసించిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. మృతుని కుటుంబీకులకు, పరిసర ప్రాంతాల వారికి పరీక్షలు చేయించారు. మృతుడి కుటుంబానికి చెందిన ఇద్దరికి, నివాస ప్రాంతమైన వరవకట్టకు చెందిన మరో ముగ్గురికి పాజిటివ్ నమోదు అయినట్లు ఆర్డీఓ అధికారికంగా తెలిపారు. ఈ కారణంగా.. నరసరావుపేటలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరినట్లు వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
నరసరావుపేటలో ఆరుకు చేరిన కరోనా కేసులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు ఆరుకు చేరుకున్నాయని స్థానిక ఆర్డీఓ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. ఇటీవల పట్టణంలోని వరవకట్టకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్ కేసుతో మృతి చెందాడు. అప్రమత్తమైన అధికారులు అతని కుటుంబీకులతో పాటు నివాస ప్రాంతామైన వరవకట్టకు చెందిన మరికొందరిని గుంటూరులోని క్వారంటైన్ కు తరలించారు.
నరసరావుపేటలో ఆరుకు చేరిన కరోనా కేసులు