రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ - కొవిడ్ 19 ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఐసీడీఎస్, ఎన్జీవో సహకారంతో చేపట్టిన తనిఖీల్లో.. మొత్తం 65 మంది వీధి బాలలను గుర్తించి అదుపులోకి తీసుకునట్లు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.
ఆ పిల్లలందరికీ కొవిడ్ పరీక్షలు చేసినట్టు చెప్పారు. అందులో... ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. వాళ్లను వారివారి తల్లిదండ్రుల అనుమతితో అడవి తక్కెళ్లపాడులోని టిడ్కో క్వారంటైన్ సెంటర్కు తరలించి పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.