ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంక్రాంతికి 6400 ప్రత్యేక బస్సులు.. ఈసారి సాధారణ చార్జీలే: ఆర్టీసీ ఎండీ

Special Buses for Sankranthi: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ బస్సుల్లో వసూలు చేసే చార్జీలే ఉంటాయని తెలిపారు. జనవరి 6 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉన్నట్లు పేర్కొన్నారు.

Special buses for Sankranti
సంక్రాంతికి ప్రత్యేక బస్సులు..

By

Published : Dec 19, 2022, 9:04 PM IST

Special Buses for Sankranthi: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికోసం 6400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు,.. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. జనవరి 6 నుంచి 18వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించామన్న ఎండీ.. ఒకేసారి రానుపోను టికెట్లు బుకింగ్ చేసుకుంటే 10శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ఏడాది నవంబర్ నాటికి ఆర్టీసీకి రూ.2,623 కోట్లు ఆదాయం వచ్చిందని, ఈ ఏడాది నవంబర్ పూర్తయ్యే సరికి సంస్థకు రూ.3,866కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు.

ఆర్టీసీ సంస్థలోకి 62 స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టామని.. వచ్చే మార్చి నాటికి కార్గో ద్వారా రూ.165 కోట్లు ఆదాయం తేవడమే లక్ష్యమన్నారు. కాగా అన్ని బస్సుల్లో ఈ నెలాఖరు వరకు యూటీఎస్ టిమ్ మిషన్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే ఆర్టీసీలో ఇప్పటివరకు 191మందికి కారుణ్య నియామకాలు ఇచ్చామని, మిగిలిన వారికీ కూడా క్రమంగా కారుణ్య నియామకాలు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనే లేదని ఎండీ స్పష్టం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని స్పష్టం చేశారు.

బాపట్ల జిల్లాలో ఆర్టీసీ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కోసం కేటాయించినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆ స్థలం ఆర్టీసీకి గతంలో ఎపీఐఐసీ కేటాయించిందన్నారు. ఆర్టీసీ ఆస్తులు కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై, ప్రభుత్వంపై ఉందన్నారు. స్థలం కేటాయింపు విషయం తెలియగానే తాము తీవ్రంగా నిరసన తెలిపామన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details