BABY DEAD: ఆడుకుంటుండగా ప్రమాదం... గేటు మీద పడి.. - వినాయక మండపం వద్ద బాలిక మృతి
13:00 September 12
ఆ పాప పాలిట మృత్యుపాశమైన తాడు
అప్పటిదాకా ముద్దుముద్దు మాటలతో నవ్వుతూ..ఆడుతున్న చిన్నారి కళ్లముందే కడతేరిపోయింది. ఏమైందోనని తేరుకునేలోపే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. వినాయక మండపానికి కట్టిన తాడే ఆ పాప పాలిట మృత్యుపాశమైంది.
గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి సంబంధించిన తాడును గోడ దిమ్మకు కట్టారు. అయితే పిల్లలు ఆడుకుంటూ తాడుపై వేలాడారు. దీంతో గేటు దిమ్మె ఒక్కసారిగా ఊడిపడి ప్రమాదం జరిగింది. దిమ్మె ఊడి మీదపడటంతో నందిని అనే ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని ఘటనతో తల్లిదండ్రులు శ్రీధర్, పార్వతీలు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: ACCIDENT: విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కాల్వలో పడ్డ కారు.. విద్యార్థి మృతి - ఏడుగురికి గాయాలు