గుంటూరు జిల్లాలో మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో నరసరావుపేటలో-3, తెనాలిలో-2, గుంటూరు ఆనందపేటలో మరో కేసు నమోదైంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 432కు చేరుకుంది. కేసుల పరంగా చూస్తే గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 178, నరసరావుపేట పరిధిలో 185 కేసులు ఇప్పటి వరకు బయటపడ్డాయి. రెండు నెలలుగా 22వేల మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. అందులో 21వేల 200 మందికి నెగిటివ్ రాగా... మరో 300 వరకు నివేదికలు రావాల్సి ఉంది. జిల్లాలో గతంతో పోలిస్తే కేసుల నమోదు తగ్గుతుండటం సానుకూల పరిణామంగా భావిస్తున్నప్పటికీ... కొత్తగా కోయంబేడు కాంటాక్టు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.
గుంటూరు జిల్లాకూ ‘కోయంబేడు’ భయం..! - guntur latest news
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ… కోయంబేడు భయం వెంటాడుతోంది. కొత్తగా కోయంబేడు కాంటాక్టు కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం జిల్లాలో కొత్తగా 6 కేసులు నమోదయ్యాయి.
గుంటూరు జిల్లాకూ ‘కోయంబేడు’ భయం