ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు జిల్లా రేపూడి వద్ద రోడ్డుప్రమాదం - ఆరుగురు మృతి - గుంటూరులో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

road accident in repudi guntur
road accident in repudi guntur

By

Published : Feb 10, 2020, 10:26 AM IST

Updated : Feb 10, 2020, 12:27 PM IST

10:23 February 10

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రేపూడి వద్ద ఆటో-మినీ లారీ ఢీకొని ఆరుగురు మృతి చెందారు. ఘటనాస్థలిలో నలుగురు, ఆస్పత్రికి తరలిస్తుండగా ఇద్దరు మరణించారు. యడ్లపాడు మండలం పుట్టకోటకు చెందిన ముగ్గురు.. కాకాని రమాదేవి, మణికంఠ, యశస్వినిగా గుర్తించగా... మరో ముగ్గురిి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

గుంటూరు జిల్లా రేపూడి వద్ద రోడ్డుప్రమాదం - ఆరుగురు మృతి

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో ఆటో-మినీ లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ఘటనా స్థలంలో అక్కడికక్కడే నలుగురు మరణించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో ఒకరు... గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకరు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు యడ్లపాడు మండలం పుట్టకోటకు చెందినవారు. వర్షం పడుతుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరికి ఆస్పపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.

Last Updated : Feb 10, 2020, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details