అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరులోని కెనడి పాఠశాల ఆధ్వర్యంలో 5కె నడక నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హోం మంత్రి సుచరిత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కొంత దూరం నడిచారు. గుంటూరు లాడ్జి సెంటర్ అంబేద్కర్ కూడలి నుంచి గోరంట్ల కూడలి వరకు 5కె నడక కొనసాగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని.. అప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని సుచరిత అన్నారు. మహిళలకు మానసిక స్థైర్యంతో పాటు శారీరక దృఢత్వమూ కావాలన్నారు. ఆడదంటే అబల కాదు సబల అని... రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించి తమ గొప్పతనాన్ని చాటి చెప్పాలని ఆశించారు. మహిళలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
ఆడదంటే అబల కాదు.. సబల: హోం మంత్రి - గుంటూరులో 5కె నడక
గుంటూరు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 5కె నడక నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని హోం మంత్రి సుచరిత అన్నారు. 'ఆడదంటే అబల కాదు సబల' అని.. మానసిక స్థైర్యంతో మహిళలంతా ముందుకు వెళ్లాలని తెలిపారు.
మహిళా దినోత్సం సందర్భంగా గుంటూరులో 5కే నడక