ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

గుంటూరు జిల్లాలో కొత్తగా 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57, 942 కి చేరింది. వైరస్ ప్రభావంతో మరో నలుగురు ప్రాణాలు కోల్పోగా... మొత్తం మరణాల సంఖ్య 544 కు చేరింది.

గుంటూరులో కొత్తగా 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
గుంటూరులో కొత్తగా 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

By

Published : Oct 4, 2020, 10:16 PM IST

గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో కొత్తగా 562 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 57, 942 కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 169 ఉన్నాయి.

అచ్చంపేటలో 10, సత్తెనపల్లి 23, తాడికొండ 23, చిలకలూరిపేట19, వినుకొండ 12, బట్టిబ్రోలు 27, బాపట్ల 17, చేబ్రోలు 20, చెరుకుపల్లి 57, కర్లపాలెం 10, పొన్నూరు 18, రేపల్లె 18, తెనాలిలో 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 50 వేల 948 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో మొత్తం మరణాల సంఖ్య 544 కు చేరింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల ఎక్కువ మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details