రాష్ట్రంలో మరో 50 మందికి కరోనా... ఇద్దరు మృతి - 50 more corona cases registerd in ap
12:48 June 05
73కి చేరిన మృతుల సంఖ్య
రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు వరకూ చేసిన కరోనా నిర్ధరణ పరీక్షల్లో కొత్తగా 50 మందికి వైరస్ సోకినట్టు తేల్చారు. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,427కి చేరింది. ఇందులో 2,294 మంది డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణా జిల్లాలో కొవిడ్ కాటుకు తాజాగా ఇద్దరు బలవగా.... మొత్తం మృతుల సంఖ్య 73కి చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1060 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో మొత్తం మీద 9,831 నమూనాలను పరీక్షించారు.