గుంటూరు నగర శివారు నల్లపాడు అడవి తక్కెళ్ళపాడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 4 లక్షల 42వేల 382 రూపాయల నగదు దొంగలించారు. సూపర్ వైజర్ డేవిడ్ రాజు ఉదయం దుకాణం తెరచి చూడగా తాళాలు పగలు కొట్టి బీరువాలో ఉన్న నగదు మాయం అయినట్లు గుర్తించాడు. వెంటనే స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వీరా స్వామి, క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనకు గల కారణాలుపై అరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో నాలుగు లక్షలు పైగా నగదు చోరీ - CRIME NEWS IN GUNTUR
ప్రభుత్వం మద్యం దుకాణంలో 4 లక్షల 42వేల 382 రూపాయలు అపహరణకు గురైన ఘటన గుంటూరు నగర శివారులో జరిగింది. దుకాణం సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 లక్షలు చోరీ