ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఐదుగురికి కరోనా - గుంటూరు కాార్పొరేషన్ కార్యాలయంలో కరోనా

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఐదుగురికి కరోనా నిర్దరణ అయ్యింది. మొదటగా ఓ క్లర్క్​కు కరోనా రాగా కార్యాలయంలోని అందరికీ పరీక్షలు చేయించారు. మరో నలుగురికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.

5 effected with corona at guntur corporation office
గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఐదుగురికి కరోనా

By

Published : Jul 11, 2020, 1:11 PM IST

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్పొరేషన్​లో పని చేస్తున్న ఐదుగురికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఉప కమిషనర్​తో పాటు ఇంజనీరింగ్ విభాగంలోని అధికారి, మరో ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకింది. మొదటగా ఓ క్లర్క్​కు కరోనా రాగా కార్యాలయంలోని అందరికీ పరీక్షలు చేయించారు. దీంతో మరో నలుగురికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.

ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయించారు. అలాగే ఉద్యోగులు భౌతిక దూరం పాటించి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఎవరైనా అనారోగ్యం పాలైతే ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి: కరోనా వేళ... ఎంసెట్​ ఎలా? విద్యార్థుల్లో సందేహాలు

ABOUT THE AUTHOR

...view details