వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజధాని అమరావతిలోనూ రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. భారత్‌బంద్‌లో భాగంగా తుళ్లూరులో రైతులు, మహిళలు బ్యాంకులు, పాఠశాలలు మూయించి రహదారిపై నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తుళ్లూరు, వెలగపూడి, అనంతవరం, వెంకటపాలెం, బోరుపాలెం, పెదపరిమి గ్రామాల్లో.. రైతులు దీక్షా శిబిరాల్లో 465వ రోజూ నిరసన దీక్షలు కొనసాగించారు.
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అమరావతిలోనూ నిరసన హోరు - అమరావతి కోసం రైతుల 465వ రోజు నిరసనలు
అమరావతినే పాలన రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. దీక్షా శిబిరాల్లో 465వ రోజూ రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులు నిరసన చేపట్టారు.
అమరావతి రైతుల 465వ రోజు నిరసనలు