ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు బస్సు బోల్తా... 40 మందికి గాయాలు - రొంపిచర్ల రోడ్డు ప్రమాదం అప్​డేట్

గుంటూరు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఒక చోట ప్రైవేటు బస్సు బోల్తా పడి 40 మంది గాయపడగా, మరో చోట ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

accident
ప్రైవేటు బస్సు బోల్తా... 40 మందికి గాయాలు

By

Published : Dec 17, 2020, 9:35 AM IST

ప్రైవేటు బస్సు బోల్తా... 40 మందికి గాయాలు
  • నార్కట్​పల్లి - అద్దంకి హైవేపై ప్రమాదం

గుంటూరు జిల్లా రొంపిచర్ల వద్ద నార్కట్​పల్లి - అద్దంకి హైవేపై ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న బస్సు, నార్కట్​పల్లి - అద్దంకి రహదారిపైకి వచ్చేసరికి ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.

తెనాలిలో లారీని ఢీకొట్టిన కారు
  • తెనాలిలో..

గుంటూరు జిల్లా తెనాలిలో ఆగి ఉన్న లారీని.. కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భద్రాచలం నుంచి వేమూరు మండలం జంపని గ్రామానికి ముగ్గురు వ్యక్తులు కారులో వెళ్తున్నారు. తెనాలి ఎన్వీఆర్ బ్రిడ్జి వద్ద సిమెంట్ లోడుతో ఆగి ఉన్న లారీని, కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన ముగ్గురినీ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details