విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు కొత్తపేట ఎస్సై నాగేంద్ర, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావును ఐజీ ప్రభాకరరావు సస్పెండ్ చేశారు. తాడికొండ, పట్టాభిపురం ఏఎస్ఐలు మధుసూదనరావు, షేక్ అజీజుల్ రహమాన్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
గుంటూరు అర్బన్‌లో నలుగురు పోలీస్ సిబ్బందిపై వేటు - నలుగురిని సస్పెండ్ చేసిన ఐజీ ప్రభాకరరావు న్యూస్
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గుంటూరు అర్బన్ పరిధిలో నలుగురు పోలీస్ సిబ్బందిపై దక్షిణ కోస్తా ఐజీ ప్రభాకరరావు క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. మరోవైపు ముగ్గురు సీఐలను బదిలీ చేశారు.
4 police officers suspension in south coastal zone
ప్రాథమిక విచారణ అనంతరం కాండక్ట్ రూల్స్ అతిక్రమించినందుకు వీరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు ఐజీ ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు గుంటూరు రేంజ్ పరిధిలో ముగ్గురు సీఐలను బదిలీ చేశారు. చీరాల గ్రామీణ సీఐ వెంకటేశ్వర్లును చిలకలూరిపేట పట్టణానికి, వీఆర్‌లో ఉన్న వెంకటరెడ్డిని గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐగా, గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐ కె.వాసును రేంజ్ వీఆర్‌కు బదిలీ చేశారు.
ఇదీ చదవండి: కూరలో పురుగుల మందు గుళికలు.. అవ్వ పెట్టిన బువ్వే ఆఖరిదైంది
TAGGED:
ig prabhakararao latest news