ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోయపాలెం క్వారీగుంతలో నలుగురు యువకులు గల్లంతు - గుంటూరు జిల్లా ప్రధాన వార్తలు

బోయపాలెం క్వారీగుంతలో యువకులు గల్లంతు
బోయపాలెం క్వారీగుంతలో యువకులు గల్లంతు

By

Published : Jul 11, 2021, 6:42 PM IST

Updated : Jul 12, 2021, 7:43 AM IST

18:38 July 11

4 missing in boyapalem quarry

నలుగురు యువకులు గల్లంతు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన నలుగురు యువకులు గల్లంతయ్యారు . బిళ్లా సాయి ప్రకాష్, సిద్ధంశెట్టి వెంకటేష్, లంబు వంశీ, ఈగుటూరి శంకర్, యశ్వంత్, హేమంత్ అనే ఆరుగురు స్నేహితులు. వీరంతా ప్రత్తిపాడుకు 10 కిలోమీటర్ల సమీపంలోని బోయపాలెం వద్ద కలుసుకున్నారు. వీరిలో కొందరు చదువుకుంటుండగా.. మరి కొందరు వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్నారు. సరదాగా గడుపుదామని డైట్ కళాశాల వెనుక ఉన్న క్వారీ గుంత వద్దకు వెళ్లారు. కాసేపు ఆడుకున్న తర్వాత కాళ్లు చేతులు కడుక్కుందామని క్వారీ గుంతలోకి దిగారు. యశ్వంత్, హేమంత్ ఒడ్డున కూర్చున్నారు. క్వారీ గుంత లోతుగా ఉండడం వల్ల....అందులోకి దిగిన నలుగురు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న స్నేహితులు వారిని రక్షించేందుకు విఫలయత్నం చేశారు. తమ కళ్ల ముందే మిత్రులు నీట మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు.

యువకుల గల్లంతు విషయం తెలుసుకున్న  రెవెన్యూ, పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఎన్డీఆర్‌‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించారు. గల్లంతు అయిన వారి కోసం గాలింపు చేపట్టారు. క్వారీ గుంతలో యువకులు మునిగారని ఫోన్‌ ద్వారా సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భద్రత దృష్ట్యా వారిని ఘటనా స్థలికి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

నలుగురు యువకుల గల్లంతుతో ప్రత్తిపాడులో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇదీ చదవండి:

pulichinthala project: ప్రభుత్వ విప్​ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

Last Updated : Jul 12, 2021, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details